Amrutha-1

అ.. అ.. అమృత… | EP 1

అజయ్, అభి.. ఇద్దరు ప్రాణ మిత్రులు, అజయ్ కి అమ్మాయిలంటే ప్రాణం అభికి అజయ్ అంటే ప్రాణం..అజయ్ కి ఒకరోజు సిగరెట్ తాగాలనిపించి సిగరెట్ కొన్నాడు ..అగ్గిపెట్టకు డబ్బులు లేవు, చుట్టూ వెతికాడు ఎవరు లేరు ..పరువు చంపుకొని షాప్ వాడిని అరువు అడిగాడు…షాప్ వాడు ఛిపో అన్నాడు, కరువులో ఉన్న అజయ్ కి గుండె బరువెక్కింది ఏంటి ఈ జీవితం అని అనుకునేలోపు సిగిరేట్ వెలిగింది…ఎలా అని చూసేలోపు అభి ఉన్నాడు…అగ్గిపెట్టని ఎక్కడ దొంగలిచావ్ ??అని అభిని అపార్థం చేసుకున్నాడు అజయ్ ..తనే పాపం ఎరుగడని తను మార్గదర్శిలో చేరి అగ్గిపెట్ట కొన్న విషయాన్ని అజయ్ కి వివరించాడు అభి …అది విన్న అజయ్ కి తన మిత్రుడి గొప్పదనం మహా గొప్పగా అర్థమైంది….అలా సిగిరేట్, అగ్గిపుల్లలా కలిసిమెలసి ఉన్న అజయ్, అభిల మధ్య… ఒక రోజు . . .

రోజులానే అజయ్ ఆరింటికి అలారం పెట్టుకొని ఏడింటికి లేచాడు..అసలే ఆరోజు అజయ్ కి ఇంటర్వ్యూ..లేవగానే తన జిగిడి దోస్త్ అభి మొహం చూస్తే లక్ అని ఫీల్ అయ్యే అజయ్…అభి కోసం కళ్ళు మూసుకుని వెతికాడు, ఎక్కడా అభి కనిపించలేదు…ఈలోపు తలుపు కొట్టిన చప్పుడు వినిపిస్తే ఎవరా అని తలుపు తీసాడు…” అభి వాళ్ళ రూమ్ ఇదేనానండి..?” అనే తియ్యని స్వరం వినిపించింది …వెంటనే కళ్ళు తెరిచిన అజయ్ కి సన్నని ఆకారంతో గ్రహణం వీడిన చందమామ కాంతితో కోడి గుడ్డు లాంటి మొహానికి రెండు ఆవాలు అద్దిన కళ్ళతో అందమైన అమ్మాయి ఎదురుగా నుంచోనుంది…చూడగానే నయాగరా వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయినా నిగ్రహంతో ఆపుకొని అభి రూమ్ ఇదే.. మీరేవరండి అని అడిగాడు..”నా పేరు అమృత ..పై పోర్షన్ లో మా మావయ్య గారు ఉంటారు, వాళ్ళింటికి వచ్చాను మా మామయ్య అభి గారి దగ్గర అగ్గిపెట్ట ఉంటే తీసుకోని రమ్మన్నారు ఇస్తారా …”” అంది వెంటనే అజయ్ గాడు అభి మార్గదర్శిలో కూడబెట్టి కొన్న అగ్గిపెట్టని అమృత కిచ్చి నా పేరు అజయ్ …అభి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు …తను సిగ్గు పడుతూ అగ్గి పెట్టెను తీసుకోని పైకి పరిగెతింది, ఈలోపు ఫ్రెండ్ ఇంటర్వ్యూ సక్సెస్ కావాలని..గుడికి వెళ్లి అర్చన చేయించుకొచ్చిన అభి , “ఎవ్వర్రా ఆ అమ్మాయి ?” అని అజయ్ ని ఆగిగాడు ..అజయ్ జరిగిందంతా అభికి చెప్పాడు, ఈలోపు ఇంటర్వ్యూ టైం అవటంతో అజయ్ హడవుడిగా రెడీ అయ్యి రోడ్ ఎక్కాడు క్యాబ్ బుక్ చేస్తే క్యాన్సల్ అయ్యింది…క్యాబ్ వాడిని చాలా తిట్టుకున్నాడు, అదే టైములో ఒకతను పిలిచి మరి లిఫ్ట్ ఇచ్చాడు …వెళ్ళే దారిలో ఇద్దరు చాలా అంశాలు మాట్లాడుకున్నారు..

అజయ్ ఎట్టకేలకు టైంకి ఇంటర్వ్యూకి వెళ్లాడు లోపలికి వెళ్తే తనకి లిఫ్ట్ ఇచ్చిన వాడె ఇంటర్వ్యూ చేసేది…ఇంకెముంది అజయ్ సెలెక్ట్ అయ్యిపోయాడు… ఆ ఆనందంలో ఇంటికి వచ్చి అభితో తన అనందం పంచుకున్నాడు ..అభి కూడా చాలా హ్యాపీ …ఈలోపు టీవీ పెడితే పొద్దన్న క్యాన్సల్ అయినా క్యాబ్ కి ఆక్సిడెంట్ అయ్యిందని టెలికాస్ట్ అవుతుంది. అజయ్ కి ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు ..ఏంటి ఈరోజు అదృష్టం ఇలా కలిసొచ్చిందని ఆలోచిస్తూంటే…. పొద్దున్నా తను మొదట చుసిన అమృత మొహం గుర్తొచింది.. తన లక్ కి కారణం అమృత నే అని అజయ్, తన ఫ్రెండ్ జాబు కి తన పూజలే కారణం అని అభి ఫీల్ అవుతున్న టైములో …

Amrutha-2

అ.. అ.. అమృత… | EP 2

“టైం 8 దాటిపోతుంది ఇంకా క్యారేజి కట్టలేదు.. పని పాట ఎటు లేదు కదా కనీసం వంటన్నా సరిగా చేద్దామనే ఇంకితం కూడా లేదు ఈ మనిషికి.. ఇదిగో ఇంకో పది నిమిషాలైతే మా ఆఫీసు క్యాబ్ వెళ్ళిపోతుంది త్వరగా కానీ,” గుక్క తిప్పుకోకుండా అరుస్తోంది బక్క పలచని అమృత …….” ఇదిగో అయిపోవచ్చింది అంటూ.. వాటర్ బాటల్ లో నీళ్ళు నింపుతూ క్యారేజి సర్దిచ్చాడు గజగజ వణికే అజయ్.
హ్మ్ ” నేను వెళ్ళాక నిద్ర పోవటమేనా ఇంటర్వ్యూ లకి ప్రిపేర్ అయేది ఏమైనా ఉందా?” కోపంగా అడిగింది అమృత .. అబ్బే అలాంటిదేమీ లేదు అమృత ఈసారి ఇంటర్వ్యూ లో పక్కా జాబు కొట్టేస్తా… ఈ సెలెక్ట్ కాకపోతే బేగంపేట సర్కిల్ లో బట్టల్ ఇప్పి తిరుగుతా నువ్వే చూస్తావ్ గా అంటూ అర్జున్ రెడ్డి ఆటిట్యూడ్ తో జవాబిచ్చాడు అజయ్,
చూస్తా చూస్తా.. ఈ సారి సెలెక్ట్ కాకపోవాలి, ఆ సర్కిల్ దగ్గరే నీకు . . . మమూలగా ఉండదు.. అంటూ కోపంగా ఊగిపోయింది అమృత.
ఎంత రేసేషన్ వచ్చి మా కంపనివాళ్ళు డెసిషన్ లేకుండా నన్ను పికేస్తే మాత్రం ఇంతా ఇదిగా చూస్తావా ??.. నిన్ను ప్రేమించి పెళ్ళిచేసుకున్న పాపానికి పాలకూర పప్పులో పోపు ఏసే స్థితికి దిగజారింది నా జీవితం అని తన మనసులో తను అనుకుంటూ అమృత కి టాటా చెప్పాడు అజయ్.

అట్టా అమృత వెళ్లిందో లేదో… ఇట్టా అఖిల్ కి ఫోన్ చేసాడు అజయ్.. ” హలో అఖిల్…
అఖిల్ : హ చెప్పారా…
అజయ్ : మనసేమి బాలేదురా…
అఖిల్ : మోషన్ టాబిలెట్లు ఎస్కోరా సెట్ అవుతుంది….
అజయ్ : చేసింది చాల్లే కానీ, అమృత ఇప్పుడే వెళ్ళింది …నువ్వు అసలైన ‘అమృతాన్ని’ పట్టుకొచ్చేయ్.. ఆత్రుతగా ఆర్డర్ ఎసాడు అజయ్.
30 నిమిషాల తర్వాత….

మత్తలో మూడో పెగ్ ని నాలుగోసారి కలుపుతున్న అజయ్ సడన్ గా ఏడుస్తూ
“అసలు పెళ్లి అనేది చేస్కోకూడదురా… నా భార్య ఉందే అమృత…అది పేరుకే అమృత కానీ నా మీద కక్కేదంతా విషమేరా …ఇదే విష్యం అభి గాడు చేప్తే నేను వినలేదురా..”
“అభి గాడు అంతలా ఎం చెప్పాడు రా?? తాగుతూన్న అజయ్ ని అడిగాడు తూగుతున్నా అఖిల్…
” అభి గాడు దేవుడు రా… ఉల్లి దోశ లో ఉల్లిపాయలు ఉంటాయి కానీ రవ్వ దోశ లో రవ్వ ఉండదని” చెప్పాడురా…!!
“అబ్బా … అంత గొప్పగా చెప్పాడా ఇంతకి అభి ఏడిరా?? అడిగాడు అఖిల్.

ఆ ప్రశ్నకి తీవ్రమైన వేదనతో ముక్కు చీదుకుంటూ…” ఇంకెక్కడి అభి రా… గోరా బాబా దర్శనానికని హౌరా ఎక్సప్రెస్ ఎక్కిన అభి ఘోరతి ఘోరంగా రైల్ ప్రమాదంలోనే ….. (ఎడుస్తూ) … కనీస్౦ బాడీ కూడా దొరకలేదురా…..”
అఖిల్: ఏంటి బాడీ కూడా దొరకలేదా మరి పోయాడని ఎలా గుర్తించావ్??
అజయ్: పట్టాల మీద పీచు గడ్డం పడిఉందిరా…అది చూసి గుర్తుపట్టా.. అదిగో అది అదే అని అభి గుర్తుగా.. తన పీచు గడ్డన్ని ఫ్రేమ్ కట్టి0చ్చి దానికి దండెసి గోడకు పెట్టినా ఫోటో చుపించాడు అజయ్…..

ఇద్దరు అలా అభి గురించి తూలుతూ మాట్లాడుకుంటన్న సమయ0లో ….
తలుపు తీస్కొని లోపలికి వచ్చింది అమృత…

ఇంకాఉంది !!!

To Be Continued . . .

Written by: Krishna PV